Breaking News

తెలంగాణలో బీజేపీది ఒంటరి ప్రయాణమే

Oct 28, 2018 19:10 by Admin Admin

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ సంబంధాలున్నాయనే వాదన ఒకటి ప్రచారంలో ఉంది. అందులో భాగంగానే ముందస్తు ఎన్నికలకు బీజేపీ సహకరించిందని కూడా రాజకీయ ప్రత్యర్థులు అంటుంటారు. ఈ విమర్శలపై శ్రీపీఠం అధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీది ఒంటరి ప్రయాణమేనని కుండబద్ధలు కొట్టారు. ఏ పార్టీతో ఏ రకంగానూ అంటకాగడం లేదని తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దలు ఈ విషయమై తనకు స్పష్టత ఇచ్చారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా వెళుతున్నామని చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe