Breaking News

ప్రయాణికులంతా దుర్మరణం

Oct 29, 2018 18:57 by Admin Admin

అది ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకార్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్ర యం.. స్థానిక కాలమానంప్రకారం ఉదయం 6 గంటలు.. లయన్‌ ఎయిర్‌(జేడీ 610)కు చెందిన విమానంలో 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఎక్కారు..పంకల్‌ పినాంగ్‌ నగరానికి వెళ్లేందుకు 6:20కి టేకాఫ్‌ అయ్యింది.. 7:20కి గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంది.. కానీ, టేకాఫ్‌ అయున 13 నిమిషాల్లోనే అంటే 6:33కి విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సంబంధాలు తెగిపోయాయి. మరుక్షణమే జావా సముద్రంలో కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 189 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంతో సంబంధాలు తెగిపోగానే అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. హుటాహుటిన సముద్రంలోకి వెళ్లిన రెస్క్యూ సిబ్బందికి విమాన శకలాలు, ప్రయాణికుల వస్తువులు కనిపించాయి.

సముద్ర ఉపరితలం చమురుతో నిండిపోయింది. బ్లాక్‌ బాక్స్‌ కోసం వెతుకుతున్నామని, అది దొరికితేనే విమాన ప్రమాదానికి కారణాలు చెప్పగలమని ఓ నేవీ అధికారి చెప్పారు. విమానాశ్రయంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. జపాన్‌లో ఉన్న ప్రధాని మోదీ విమాన ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని పైలట్‌ కోరిన కాసేపటికే కూలిపోయింది. కాగా, జకార్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకొని విమానం ఎక్కడంలో ఆలస్యమైనందున ఇండోనేషియా ఆర్థిక శాఖ అధికారి సోనీ సిటియవాన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe