Breaking News

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 89 మందికి జైలు శిక్ష

Oct 29, 2018 19:13 by Admin Admin

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన 89 మందికి జైలు శిక్ష విధిస్తూ కూకట్‌పల్లిలోని 9వ మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌ సోమవారం తీర్పు చెప్పారు. మద్యంతాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డ 43 మందికి 3 నుంచి 23 రోజులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన 44 మందికి 4 రోజులు, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపిన ఇద్దరికి నాలుగు రోజుల జైలు శిక్ష, వాహనాల యజమానులకు రూ. 500 చొప్పున జరిమానా విధించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe