Breaking News

తెలుగులో మహానటి కి మాత్రమే గౌరవం దక్కింది

Nov 01, 2018 17:07 by Admin Admin

అలనాటి నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేశ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.  ఈ సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న 49వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పలు అంతర్జాతీయ చిత్రాలతో పాటు ‘మహానటి’ని కూడా ప్రదర్శించనున్నారు.  భారతీయ భాషల నుండి 22 చిత్రాలు ఇండియన్ పనోరమలో ప్రదర్శితం కానున్నాయి. తెలుగులో ‘మహానటి’కి మాత్రమే గౌరవం దక్కింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe