Breaking News

ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం

Nov 01, 2018 17:15 by Admin Admin

ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీ్‌సను 3-1తో దక్కించుకుంది. రెండో వన్డే టై గా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీ్‌సలో భారత్‌ జోరుకు చివరి రెండు వన్డేల్లో కలిపి విండీస్‌ చేసిన స్కోరు 257 మాత్రమే.. ఇక గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ జడేజా (4/34), పేసర్లు బుమ్రా (2/11), ఖలీల్‌ అహ్మద్‌ (2/29) విండీస్‌ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 105 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 14.5 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్‌ శర్మ (56 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీ సాధించగా విరాట్‌ కోహ్లీ (29 బంతుల్లో 6 ఫోర్లతో 33 నాటౌట్‌) రాణించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జడేజా.. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా విరాట్‌ కోహ్లీ నిలిచారు. 

స్కోరుబోర్డు
విండీస్‌: కీరన్‌ (సి) ధోనీ (బి) భువనేశ్వర్‌ 0; రోవ్‌మన్‌ (సి) ధవన్‌ (బి) ఖలీల్‌ 16; హోప్‌ (బి) బుమ్రా 0; శామ్యూల్స్‌ (సి) కోహ్లీ (బి) జడేజా 24; హెట్‌మయెర్‌ (ఎల్బీ) జడేజా 9; హోల్డర్‌ (సి) జాదవ్‌ (బి) ఖలీల్‌ 25; ఆలెన్‌ (సి) కేదార్‌ (బి) బుమ్రా 4; కీమో పాల్‌ (సి) రాయుడు (బి) కుల్దీప్‌ 5; బిషూ (నాటౌట్‌) 8; రోచ్‌ (సి) జాదవ్‌ (బి) జడేజా 5; థామస్‌ (ఎల్బీ) జడేజా 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 31.5 ఓవర్లలో 104 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-1, 2-2, 3-36, 4-53, 5-57, 6-66, 7-87, 8-94, 9-103, 10-104. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-1-11-1; బుమ్రా 6-1-11-2; ఖలీల్‌ 7-1-29-2; జడేజా 9.5-1-34-4; కుల్దీప్‌ 5-1-18-1.
 

 

భారత్‌: రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 63; ధవన్‌ (బి) థామస్‌ 6; కోహ్లీ (నాటౌట్‌) 33; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 14.5 ఓవర్లలో 105/1. వికెట్‌ పతనం: 1-6. బౌలింగ్‌: రోచ్‌ 5-2-30-0; థామస్‌ 4-0-33-1; పాల్‌ 2-0-22-0; హోల్డర్‌ 1-0-15-0; బిషూ 1.5-0-16-0; ఆలెన్‌ 1-0-5-0.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe