Breaking News

ఆరురోజుల పాటు ప్రాణాలతో కారులోనే

Nov 01, 2018 17:24 by Admin Admin

అమెరికాకు చెందిన ఓ మహిళ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆరురోజుల పాటు ప్రాణాలతో కారులోనే ఉండిపోయింది. ఈ ప్రమాదం అర్జోనా స్టేట్‌లో బుధవారం జరిగింది. మహిళ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుపొదల్లోకి దూసుకెళ్లింది. 50ఏళ్ల మహిళ ప్రయాణిస్తున్న కారు ఉత్తర పొనెక్స్‌కు (80కిలోమీటర్లు) దూరంలో ఉన్న వికెన్ బర్గ్‌కు సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పినట్టు అర్జోనా ప్రజా భద్రతా శాఖ వెల్లడించింది. అదుపు తప్పిన కారు రేయిలింగ్‌ మీదుగా 50 అడుగుల మేర చెట్టుపొదల్లోకి దూసుకెళ్లినట్టు ట్రూపర్స్ గుర్తించారు.

అలా 457 మీటర్ల దూరం వెళ్లగా తీవ్రగాయాలతో బాగా నీరసించిపోయి ఉన్న మహిళను గుర్తించారు. వెంటనే మహిళను రక్షించి హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం తాను కొన్నిరోజుల పాటు కారులోనే ఉన్నానని, ఆ తరువాత అతికష్టం మీద కారులో నుంచి బయటకొచ్చి రైలురోడ్డు ట్రాక్స్ వద్దకు చేరుకున్నట్టు బాధిత మహిళ తెలిపింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe