Breaking News

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

Nov 01, 2018 17:39 by Admin Admin

ప్రపంచంలోనే తొలి మడతబెట్టే ఫోన్‌ను చైనాకు చెందిన రాయ్‌లీ కార్పొరేషన్ సంస్థ విడుదల చేసింది. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను 2 లక్షల సార్లు మడతబెట్టి పరీక్షించినట్టు దీనిని తయారుచేసిన రౌయూ టెక్నాలజీ తెలిపింది. అయినప్పటికీ స్క్రీన్‌పై ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.
 
 
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 7.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 7ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8150 ‘ఫ్లెక్సీ పై’ 6జీబీ/128 జీబీ, 8జీబీ/256 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 16 ఎంపీ+ 20 ఎంపీ డ్యూయల్ కెమెరా ఉంది. అయితే, ఫోన్ మమాలుగా ఉన్నప్పుడు ఇది ఫ్రంట్ కెమెరాగా, మడతబెట్టినప్పుడు రియర్ కెమెరాగా పనిచేస్తుంది. 3,800 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ కనీస ధర రూ.90 వేలు ఉండే అవకాశం ఉంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe