Breaking News

ఫేస్‌బుక్‌ ఖాతాల హ్యాక్‌

Nov 03, 2018 20:40 by Admin Admin

ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో 81 వేల అకౌంట్లలోని సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఒక్కో అకౌంట్‌ను 10 సెంట్ల సుమారు రూ.7 చొప్పున అమ్మకానికి ఉంచారు. తాజా ఘటనలో 9 కోట్ల అకౌంట్లను పునరుద్ధరించినట్లు చెప్పింది. అయితే హ్యాకింగ్‌ గురించి తెలిసినప్పటి నుంచీ నెటిజన్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 
ఉక్రెయిన్‌, రష్యా, యూకే, అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాలకు చెందిన యూజర్ల ఖాతాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి హ్యాకింగ్‌ గురించి సెప్టెంబరులోనే గుప్పుమన్నా ఫేస్‌బుక్‌ యాజమాన్యం కొట్టిపారేసింది. అయితే.. అకౌంట్లలోని సమాచారం ప్రచురించిన వెబ్‌సైట్లను తొలగించాలని పోలీసు విభాగాలను కోరినట్లు ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు గయ్‌ రోజ్‌ తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe