Breaking News

కేంద్రానికి దాసోహం అవకుండా ఎన్టీఆర్ పరిపాలన

Nov 03, 2018 20:49 by Admin Admin

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని లక్ష్మీపార్వతి ఖండించారు. ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ  తలవంచకుండా ఎన్టీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు.  ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు’ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe