Breaking News

ప్రపంచదేశాలకు అమెరికా హెచ్చరిక

Nov 05, 2018 18:58 by Admin Admin

చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఆర్థిక యుద్ధాన్ని పరాకాష్ఠకు చేరుస్తూ.

ఇంధనం,బ్యాంకింగ్‌ రంగాలపై ఇప్పటికే ఉన్న ఆంక్షలను  కఠినతరం చేసింది.  ‘కనీవినీ ఎరుగనంత ఉక్కు ఆంక్షల చట్రం’లో ఇరాన్‌ను బిగించేసినట్టు ప్రకటించింది. తమ మాట కాదన్న దేశాలపై భారీ జరిమానా సహా కఠిన చర్యలు తప్పవని ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరించింది.  ఇరాన్‌కు  దారిలోకి తేవడానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు.  

 
భారత చమురు అవసరాల్లో చాలాభాగం ఈ దేశమే తీరుస్తోంది. ఇప్పటికే మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆందోళనకరస్థాయికి చేరుకొన్నాయి. చివర్లో భారత్‌ సహా ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించారు. చైనా, ఇటలీ, గ్రీస్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, టర్కీలకు సైతం మినహాయింపు ఇచ్చారు. 
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe