Breaking News

యూఏఈలో జరగనున్న టీ10 లీగ్‌

Nov 05, 2018 19:13 by Admin Admin

యూఏఈలో జరగనున్న టీ10 లీగ్‌లో భారత్‌కు చెందిన జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్ వంటి ప్రముఖ క్రికెటర్లు ఆడనున్నారు. ఎనిమిది మంది భారత క్రికెటర్ల కోసం జరిగిన డ్రాలో బెంగాల్ టైగర్స్ జట్టు జహీర్ ఖాన్‌ను, పంజాబ్ లెజెండ్స్ జట్టు ప్రవీణ్‌ను సొంతం చేసుకున్నాయి. టీ10 లీగ్ క్రికెట్ టోర్నీ ఈ నెల 21 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఎస్. బద్రీనాథ్ మరాఠా అరేబియన్స్ జట్టు  తరుపున ఆడనుండగా.. రీతిందర్ సింగ్ సోధీని కేరళ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆర్‌పీ సింగ్‌ను పఖ్తూన్స్ జట్టు ఎంపిక చేసుకోగా.. మునాఫ్ పటేల్ న్యూకమ్మర్స్ కరాచియన్స్‌కు ఆడనున్నాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe