Breaking News

ఫేస్‌బుక్ ఉన్న 1.4 కోట్ల కటెంట్‌నుతొలగించింది

Nov 09, 2018 10:47 by Admin Admin

ఫేస్‌బుక్ హానికారకంగా ఉన్న 1.4 కోట్ల కటెంట్‌నుతొలగించింది. ఐసిస్, ఆల్‌ఖైదా లాంటి ఉగ్రవాద గ్రూపులతో పాటు ఇతర ప్రమాదకర తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు భావించిన మొత్తం కంటెంట్‌ను తొలగించింది. 
ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న 99 శాతం కంటెంట్‌ను తొలగించామని ఫేస్‌బుక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పాలసీ మేనేజ్‌మెంట్ మోనికా బిక్కెర్ట్ పేర్కొంది.
 
 
ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 90.4 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకుంది. మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 30 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. 
 
 
ఐసిస్, ఆల్‌ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా వస్తున్న పోస్టులను కనుగొనడానికి సరికొత్త పద్దతిని అవలంబిస్తున్నామని, దీంతో యూజర్లకు తీవ్రవాద పోస్టులు చేరకుండా ఉంటుందని ఫేస్‌బుక్ కౌంటర్ టెర్రరిజం పాలసీ హెడ్ బ్రియాన్ ఫిష్‌మాన్ తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe