Breaking News

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు

Nov 11, 2018 18:26 by Admin Admin

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ (బీజేపీ సీనియర్ నేత) (59) కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అనంత్ కుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బెంగళూరులోని అతని స్వగృహంలోనే ఆయన తనువు చాలించారు. గత అక్టోబరు 20న లండన్ నుంచి వచ్చిన ఆయన బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కర్నాటక బీజేపీకి అధ్యక్షునిగా ఉన్నారు. అనంత్ కుమార్ 6 సార్లు దక్షిణ బెంగళూరు స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం అనంత్ కుమార్  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe