Breaking News

టీ 20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

Nov 11, 2018 18:44 by Admin Admin

చిదంబరం స్టేడియం వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ-20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. 25 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్సులతో 53 పరుగులు చేసి అర్థశతకాన్ని నమోదు చేశాడు. బ్రావో కూడా 37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. కీమోపాల్ బౌలింగ్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ (4) బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్(17) పరుగులు చేసి థామస్ బౌలింగ్‌లో రామ్‌దిన్‌కు క్యాచ్ ఇచ్చిడు. దీంతో కష్టాల్లపడ్డ జట్టకు ధవన్, పంత్‌ల జోడీ అండగా నిలిచింది. కరేబియన్ బౌలింగ్‌ని ధీటుగా ఎదురుకుంటూ.. వీరిద్దరు మైదానంలో పరుగుల వరద పారించారు. మూడో వికెట్‌కి 130 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధవన్, పంత్‌లు అర్ధ శతకాలు కూడా సాధించారు. అయితే కీమో పాల్ వేసిన 19వ ఓవర్ రెండో బంతికి అనవసర షాట్‌కు ప్రయత్నించి పంత్(58) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. ధవన్(92) భారీ షాట్‌కు ప్రయత్నించి పొలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. చివరి బంతికి పాండే వేగంగా సింగిల్ తీయడంతో ఉత్కంఠ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe