Breaking News

మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి

Nov 11, 2018 18:53 by Admin Admin

కాలిఫోర్నియాలో చెలరేగుతున్న కార్చిచ్చు విశ్వరూపం చూపుతోంది.

మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.

ఒక ఊరు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది.

మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరింది.

శుక్రవారం చెలరేగిన కార్చిచ్చు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ప్రమాదం ధాటికి సుమారు లక్ష ఎకరాల అడవి అగ్నికి ఆహుతైంది. ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే దాదాపు 15వేల ఎకరాల మేర అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.‘ బలమైన గాలి వీస్తుండటం కారణంగా కార్చిచ్చు మరింత వ్యాపించింది. 3,200మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. 6,700 భవనాల వరకు మంటల్లో చిక్కుకున్నాయి. పరిస్థితి చక్కబడటానికి సుమారు మూడు వారాలు పట్టవచ్చు. కార్చిచ్చు రేగిన ప్రాంతంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది’ అని ఓ అధికారి తెలిపారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe