Breaking News

ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో బిన్నీ బన్సాల్ రాజీనామా

Nov 13, 2018 19:54 by Admin Admin

ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్ సీఈవో బిన్నీ బన్సాల్  రాజీనామా చేశారు.  ఆయన రాజీనామాను ఆమోదించామని ఫ్లిప్‌కార్ట్ సంస్థ, మాతృ సంస్థ వాల్‌మార్ట్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. బిన్నీ బన్సాల్ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపాయి.

ప్రపంచ వ్యాపార దిగ్గజం వాల్ మార్ట్  - ఫ్లిప్‌కార్ట్‌ 77శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే బిన్నీ బన్సాల్ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై  ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ విచారణ జరిపింది.

బోర్డులో అయిదు నుంచి ఆరు శాతం వాటా ఉంది. అయితే సీఈవో పదవికి రాజీనామా చేసిన బిన్సీ బన్సాల్...బోర్డులో కొనసాగుతారా, సభ్యత్వాన్ని వదిలేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు తన రాజీనామాపై బన్సీ బన్సాల్ ఇంకా స్పందించలేదు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe