Breaking News

లగడపాటి రాజగోపాల్ సర్వే

Nov 15, 2018 18:33 by Admin Admin

ఆంధ్ర ఆక్టోపస్ అనే పేరు కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేకు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో  వార్తలు హల్‌చల్ చేశాయి.

మరోసారి లగడపాటి సర్వే లెక్కలు తెరమీదకు వచ్చాయి. రాజకీయ ఒత్తిడిలు కారణంగా ఈ సర్వేను అధికారికంగా ప్రకటించలేదంటూ ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే లగడపాటి మాత్రం తాను ఎలాంటి సర్వే నిర్వహించలేదని, రాజకీయ పార్టీలు కోరితే సర్వే చేసి, నివేదిక వెల్లడిస్తానంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే ఈ సర్వేపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు పలు జాతీయ ఛానల్స్ నిర్వహించిన సర్వేలో మాత్రం మళ్లీ అధికారం టీఆర్ఎస్‌దే అని తేలింది. మరి ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 11వరకూ ఆగాల్సిందే.

లగడపాటి సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై 
కాంగ్రెస్   -53, టీఆర్ఎస్  -42, టీడీపీ  -9, ఎంఐఎం- 7, సీపీఐ -2, టీజేసీ -2, బీజేపీ -1, ఇతరులు -3

 

 

TAGS
సర్వే,  లగడపాటి ,తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల, సోషల్ మీడియా, ఆంధ్ర ఆక్టోపస్ 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe