Breaking News

బాలీవుడ్ ప్రేమ జంట ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్

Nov 15, 2018 18:42 by Admin Admin

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకొనే-రణ్‌వీర్‌ సింగ్‌లు తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో బుధవారం కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. గురువారం సింధీ సంప్రదాయంలో మరోమారు ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి ఫొటోలు ఇప్పటి వరకు విడుదల కాకపోవడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా వారి పెళ్లి ఫొటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు. తాజాగా, కొత్త జంట తమ పెళ్లి ఫొటోలను విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫొటోలు బయటకు వచ్చాయో, లేదో.. అలా వైరల్ అయ్యాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe