Breaking News

బీజేపీ టార్గెట్‌ 65 సీట్లు

Nov 19, 2018 18:58 by Admin Admin

ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ పోలింగ్‌కు సిద్ధమయింది.  19 జిల్లాల్లోని 72 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగనుంది. మొత్తం 1057 మంది అభ్యర్థుల కాగా.. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్థితి ఉత్పన్నమవుతుందా.. అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగోసారి కూడా గెలిచి బీజేపీ పతాకాన్ని మరోసారి ఎగరేయాలని సీఎం రమణ్‌సింగ్‌ చూస్తున్నారు. గత ఎన్నికల్లో మేజిక్‌ మార్క్‌ కంటే కేవలం 3 స్థానాలు మాత్రమే ఎక్కువ సాధించగలిగిన బీజేపీ ఈసారి 65 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్‌ పూర్వవైభవం సాధించాలని చూస్తోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe