Breaking News

ఖమ్మంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

Nov 19, 2018 19:02 by Admin Admin

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది.  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ. రాష్ట్రం బాగుండాలని ‘రాజశ్యామల హోమం’ చేశానన్నారు. ఖమ్మం తలపండిన రాజకీయ నేతలున్న జిల్లాగా ఆయన అభివర్ణించారు. ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు 10 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలవబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తాను చాలాసార్లు ఖమ్మం జిల్లాకు వచ్చినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన హామీలను వందకు వంద శాతం పూర్తి చేశామన్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe