Breaking News

సుమారు 3584 నామినేషన్లు దాఖలయ్యాయి

Nov 19, 2018 19:07 by Admin Admin

అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది నామినేషన్ల పర్వంలో చివరి రోజైన సోమవారం హంగు ఆర్భాటాల మధ్య పోటా పోటీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రమంతటా సోమవారం జాతరను తలపించింది. ముహూర్తాలు చూసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంతకుముందే ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసినా.. చివరి రోజు మరోసారి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు సుమారు 3,584 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఒక్కరోజే 2,087 దాఖలయ్యాయి. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు వరకూ నామినేషన్లు దాఖలు చేశారు. 
 
అంచనాలకు మించి అభ్యర్థులు రావడంతో రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు కిటకిటలాడాయి. ఈనెల 12 నుంచి 19 వరకూ నామినేషన్లు స్వీకరించినా.. చివరి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడినవారు కూడా చివరి రోజు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. ఈ నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు మంగళవారం పరిశీలించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తిరస్కరించనున్నారు. దరఖాస్తు ఫారాలను భర్తీ చేయడంలో ఈసారి ఎన్నికల కమిషన్‌ కొత్త నిబంధన విధించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe