Breaking News

జూఆస్ట్రేలియాను ఆదుకున్న డక్‌వర్త్ లూయిస్

Nov 21, 2018 18:58 by Admin Admin

ఆస్ట్రేలి యాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ పోరాడి ఓడారు. వరుణుడు ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా గెలిచింది. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా అదే 17 ఓవర్లలో 174 పరుగులు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిర్ణీత ఓవర్లలో కోహ్లీ సేన 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) కుల్‌దీప్ (బి) ఖలీల్ 7, ఫించ్ (సి) ఖలీల్ (బి) కుల్‌దీప్ 27, లిన్ (సి) అండ్ (బి) కుల్‌దీప్ 37, మాక్స్‌వెల్ (సి) భువనేశ్వర్ (బి) బుమ్రా 46, స్టోనిస్ నాటౌట్ 33, మెక్‌డెర్మాట్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం 17 ఓవర్లలో 168/4; వికెట్ల పతనం: 1-24, 2-64, 3-75, 4-153; బౌలింగ్: భువనేశ్వర్: 30-0-15-0, బుమ్రా: 3-0-21-1, ఖలీల్: 3-0-42-1, కుల్‌దీప్: 4-0-24-2, పాండ్య: 4-0-55-2. ఇండియా ఇన్నింగ్స్: (డక్‌వర్త్ లూయిస్ టార్గెట్ 17 ఓవర్లలో 174): రోహిత్ శర్మ (సి) ఫించ్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 7, శిఖర్ ధావన్ (సి) బెహ్రన్‌డార్ఫ్ (బి) స్టాన్‌లేక్ 76, కేఎల్ రాహుల్ (స్టంప్డ్) క్యారే (బి) జంపా 13, విరాట్ కోహ్లీ (సి) లిన్ (బి) జంపా 4, రిషబ్ పంత్ (సి) బెహ్రన్‌డార్ఫ్ (బి) టై 20, దినేష్ కార్తీక్ (బి) బెహ్రన్‌డార్ఫ్ (బి) స్టోనిస్ 30, క్రునాల్ పాండ్య (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టోనిస్ 2, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 1, కుల్‌దీప్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం 17 ఓవర్లలో 168/7; వికెట్ల పతనం: 1-35, 2-81, 3-94, 4-105, 5-156, 6-163, 7-163; బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్: 4-0-43-1, స్టాన్‌లేక్: 3-0-27-1, టై: 3-0-47-1, జంపా: 4-0-22-2, స్టోనిస్: 3-0-27-2.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe