Breaking News

ఏడాది మార్చి నాటికి 50శాతం ఏటీఎంలు మూత

Nov 21, 2018 19:04 by Admin Admin

ఏటీఎం వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే..ఏటీఎం వినియోగదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే... వచ్చే ఏడాది మార్చి నాటికి సుమారు 50శాతం ఏటీఎంలు మూతబడనున్నాయట. భద్రతా కారణాలరీత్యా  2019 మార్చి కల్లా సగానికి పైగా ఏటీఎంలు క్లోజ్ అవుతాయని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) వర్గాలు హెచ్చరించాయి. మూతపడనున్న వాటిలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని ఏటీఎంలు క్లోజ్ కానున్నాయి. 

 

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,38,000 ఏటీఎం మిషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో  1,13,000లు మూతపడే అవకాశం ఉన్నట్లు  సీఏటీఎంఐ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  వీటిలో సుమారు లక్ష ఆఫ్-సైట్ ఎటీఎంలు, 15 వేలకు పైగా వైట్ లేబుల్ ఎటీఎంలు ఉన్నాయి. కాగా పెద్దనోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితి, అదనపు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సర్వీస్ ప్రొవైడర్లు...భారీ ఖర్చులు భరించలేక చేతులు ఎత్తేసే పరిస్థితి నెలకొంది.

దీంతో ఏటీఎంలు బలవంతంగా మూసివేయడం అనివార్యమవుతుందని సీఏటీఎంఐ ఆ ప్రకటనలో తెలిపింది. ఇక ప్రధానమంత్రి జన్‌థన్ యోజన లబ్దిదారులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపనుందని, ఏటీఎంలు అందుబాటులో లేకుంటే వారు  ప్రభుత్వ సబ్సిడీలను  మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలుండదు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe