Breaking News

25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి జోరుగా రైడ్

Nov 21, 2018 19:10 by Admin Admin

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకిృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టాక్సీవాలా’. శనివారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ థ్రిల్ చేస్తోంది. ఇప్పటి వరకూ 25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి జోరుగా రైడ్ చేస్తోంది. చూస్తుంటే ఈ వీకెండ్‌లో ఈ జోరు ఇంకా పెరిగేలా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
 
 
గీత ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. మాళవిక నాయర్ ముఖ్య పాత్ర పోషించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe