Breaking News

ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లలో పీఎన్‌బీ ఒకటి

Nov 23, 2018 18:33 by Admin Admin

ఏటీఎంల సంఖ్యను 2019 మార్చి నాటికి తగ్గించే ప్రధాన ప్రణాళికలు ఏవీ లేవని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్పష్టం చేసింది. రెగ్యులేటరీ విధి విధానాలలో వచ్చిన మార్పులతో ఏటీఎంల నిర్వహణ లాభసాటిగా లేదని, దేశంలోని 2.38 లక్షల మెషీన్లలో సగ భాగం 2019 మార్చి నాటికి మూతపడవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ పేర్కొన్న ఒక రోజు తర్వాత, పీఎన్‌బీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లలో పీఎన్‌బీ ఒకటిగా ఉంది. 

 

 

దానికి అఖిల భారత స్థాయిలో 9,428 ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులు, వాటి కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భద్రతా చర్యలపై ఆర్‌బీఐ సలహా ఇచ్చిందని, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను అమలుపరిచే ప్రక్రియను పీఎన్‌బీ ఇప్పటికే ప్రారంభించిందని ఆ ప్రకటన తెలిపింది. ఏటీఎం వాడకానికి సంబంధించిన వివిధ చార్జీలను పెంచే ఆలోచన కూడా లేదని పీఎన్‌బీ స్పష్టం చేసింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe