Breaking News

రెండురోజుల్లో పెరగనున్న చలితీవ్రత

Nov 26, 2018 18:43 by Admin Admin

కోస్తా తెలంగాణ వరకు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సోమవారం విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో 5.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సమీపంలోని లంబసింగిలో 3-4డిగ్రీల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఇక్కడ ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రతకు కాఫీ పండ్ల సేకరణకు వెళుతున్న కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడున్నారు. 
 
తరగతి గదిలో చలి ఎక్కువగా ఉండటంతో లంబసింగి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం 2గంటల సమయంలోనూ ఆరుబయట ఎండలో కూర్చుని పరీక్షలకు చదువుకుంటున్నారు. కాగా, రానున్న రెండు, మూడు రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఆర్‌.మురళీకృష్ణ తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe