Breaking News

హైదరాబాద్‌లో గురుద్వారను నిర్మిస్తాం

Nov 26, 2018 18:47 by Admin Admin

సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్‌ పార్టీకి లేదని, అందుకే నాలుగైదు పార్టీలతో కూటమి కట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ సింహం అని, ఆయన సింగిల్‌గానే వస్తాడని, ఆయన దమ్మున్న నాయకుడని చెప్పారు. మహాకూటమిలోని పార్టీలను మట్టి కరిపిస్తాడని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం తెలంగాణ సిక్కు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సంఘీభావ సభలో, ఖైరతాబాద్‌, గోషామహల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. సేవనాందేడ్‌లోని ప్రసిద్ధ గురుద్వార తరహాలో హైదరాబాద్‌లోని గురుద్వారను నిర్మించాలని నిర్ణయించామని, స్థలం ఎంపిక కూడా పూర్తయిందన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe