Breaking News

నాది దత్తాత్రేయ గోత్రం

Nov 26, 2018 18:52 by Admin Admin

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన పుష్కర్‌లోని ఆలయానికి వెళ్లారు. గోత్రనామాలు చెప్పాలని అక్కడి ప్రధానార్చకుడు రాహుల్‌ను కోరారు.  తాను కౌల్‌ బ్రాహ్మణుడినని, తనది దత్తాత్రేయ గోత్రమని బదులిచ్చారు. కాగా, రాహుల్‌.. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూనే దేవాలయాలు సందర్శిస్తూ పూజల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే! దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తన గోత్రమేమిటో రాహుల్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన గోత్రాన్ని వెల్లడించారు. రాహుల్‌ దత్రాత్రేయ గోత్రానికి చెందిన వాడని, ఆయన పూర్వికులు కశ్మీరీలని పుష్కర్‌ ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe