Breaking News

తొలి ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌

Nov 26, 2018 19:02 by Admin Admin

ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ సహా ఆరు జట్లు పాల్గొననున్న ట్టు లీగ్‌ సీఈఓ జై భట్టాచార్య వెల్లడించారు. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పేరుతో హైదరాబాద్‌ జట్టు తలపడనున్నది. ఫిబ్రవరి 2నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లను చెన్నై, కొచ్చిలలో నిర్వహిస్తారు. లీగ్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం డిసెంబర్‌ 13, 14 తేదీలలో నిర్వహిస్తున్నట్టు భట్టాచార్య తెలిపారు. జట్టులో మొత్తం 12 మంది ఆటగాళ్లు ఉంటారని, అందులో ఒక భారత దిగ్గజ ఆటగాడు, ఒక అండర్‌-21 ఆటగాడు ఉంటారన్నారు. జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అనుమతించనున్నారు. ప్రతిరోజు రాత్రి 7నుంచి 9 గంటలవరకు జరిగే ఈ లీగ్‌ మ్యాచ్‌లను సోనీ సిక్స్‌, సోనీటెన్‌-3 చానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. స్టార్‌ షట్లర్‌ సింధు లీగ్‌కు తన మద్దతు తెలిపింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న తొలి ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ సహా ఆరు జట్లు పాల్గొననున్న ట్టు లీగ్‌ సీఈఓ జై భట్టాచార్య వెల్లడించారు. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పేరుతో హైదరాబాద్‌ జట్టు తలపడనున్నది. ఫిబ్రవరి 2నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లను చెన్నై, కొచ్చిలలో నిర్వహిస్తారు. లీగ్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం డిసెంబర్‌ 13, 14 తేదీలలో నిర్వహిస్తున్నట్టు భట్టాచార్య తెలిపారు. ఒక్కో జట్టులో మొత్తం 12 మంది ఆటగాళ్లు ఉంటారని, అందులో ఒక భారత దిగ్గజ ఆటగాడు, ఒక అండర్‌-21 ఆటగాడు ఉంటారన్నారు. జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అనుమతించనున్నారు. ప్రతిరోజు రాత్రి 7నుంచి 9 గంటలవరకు జరిగే ఈ లీగ్‌ మ్యాచ్‌లను సోనీ సిక్స్‌, సోనీటెన్‌-3 చానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. స్టార్‌ షట్లర్‌ సింధు లీగ్‌కు తన మద్దతు తెలిపింది.
 
జట్లు: అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌, కాలికట్‌ హీరోస్‌, చెన్నై స్పార్టన్స్‌, యు ముంబా వాలీ, హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌, కొచ్చి బ్లూ స్పైకర్స్‌.
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe