Breaking News

పాక్ తీర సరిహద్దు బలగాలకు చిక్కిన మత్స్యకారులు

Nov 29, 2018 19:21 by Admin Admin

విజయనగరం జిల్లా చెందిన నలుగురు, ఈస్ట్ గోదావరి చెందిన నలుగు మత్స్యకారులు సముద్రంలో చేపల వేట నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుంచి బయలుదేరి వెళ్లినట్టు . అయితే జలాల సరిహద్దుపై అవగాహనలేక పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారని మంత్రి కళా వెంకటరావు చెప్పారు. పాకిస్థాన్ భద్రతాదళాలకు చిక్కు్కుపోయిన విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. 

సీఎం ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు, ఏపీ భవన్ అధికారులు భారత రాయభార అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారని భారత రాయభార అధికారులు, పాక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కళావెంకటరావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాక్ బలగాలకు చిక్కిన మత్స్యకారులు వెనక్కి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందవద్దన్నారు. జాలర్ల  విడుదలకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మత్స్యకారులను త్వరలోనే పాక్ బలగాల నుంచి విడిపించి వారి స్వస్థలాలకు తరింలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కళావెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe