Breaking News

నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లిన హైసిస్

Nov 29, 2018 19:26 by Admin Admin

అత్యంత తక్కువ బరువు, పరిమాణం ఉండి.. అద్భుతమైన శక్తి కలిగిన హైసిస్ (హైపర్ స్పెక్ట్రల్ ఇవేుజింగ్ శాటిలైట్)... అలియాస్ ఛోటాభీమ్ భారతదేశానికి సేవలు అందించేందుకు సిద్ధమైంది. 636 కిలోమీటర్ల పోలార్ సన్ సింక్రొనస్ ఆర్బిట్ (ఎస్‌ఎస్‌ఓ)లోకి 97.957 డిగ్రీల వంపుతో దీన్ని పీఎస్‌ఎల్వీ-సి43 రాకెట్ ప్రవేశపెట్టింది. ఐదేళ్ల పాటు నిర్విఘ్నంగా పనిచేసే ఈ ఉపగ్రహం బరువు 380 కిలోలు మాత్రవేునని, దీనికి అత్యంత శక్తిమంతమైన కళ్లున్నాయని, అతి తక్కువ దేశాలకు మాత్రమే దేశీయంగా ఈ పరిజ్ఞానం ఉందని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇది అత్యాధునికమైన ఉపగ్రహమని, అంతరిక్షంలో మనకు మంచి ఆస్తి అని ఆయన తెలిపారు. భారత ఉపఖండంపై ఇది పూర్తిస్థాయిలో కన్నేసి.. ఉపరితల వస్తువులను అత్యంత కచ్చితంగా గుర్తించడంలో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 

కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకోగానే 4 దశలతో ఉన్న పీఎస్ఎల్వీ-సీ43 రాకెట్‌ రోదసిలోకి పయనం ప్రారంభించింది. 1.49 నిమిషాలలో 49కి.మీ. ఎత్తుకు చేరాకా తొలి ఘన ఇంధన మోటారు విడిపోయింది. వెంటనే ద్రవ ఇంధనంతో ఉన్న రెండో మోటారు పని ప్రారంభించింది. సరిగ్గా 3 నిమిషాలకు 115 కి.మీ. ఎత్తులో ఉపగ్రహాలను కప్పి ఉన్న ఉష్ణ కవచం విడిపోయింది. 4.13 నిమిషాలకు 204 కి.మీ. ఎత్తులో రెండో దశ ఇంజన్‌ విడిపోయింది. ఘన ఇంధనంతో ఉన్న మూడో దశ ఇంజన్‌తో రాకెట్‌ ముందుకెళ్లింది. 8.02 నిమిషాలకు 475 కి.మీ. ఎత్తులో మూడో దశ ఇంజన్‌ విడిపోయింది. నాలుగో దశ ద్రవ ఇంధన ఇంజన్‌ ఆధారంగా ఉపగ్రహాలతో రాకెట్‌ కక్ష్య దిశగా దూసుకుపోయింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe