Breaking News

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకం

Nov 29, 2018 19:31 by Admin Admin

పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో వింత పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. దాంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి  వ్యతిరేకం గా కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు కు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. రాష్ట్రంలో మాత్రం టీఎంసీపై కాంగ్రెస్, సీపీఎం సంయుక్తంగా యుద్ధాన్ని ప్రకటించడం గమనార్హం. ఇది బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై నీలినీడలు చూపే ప్రభావం ఉందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చోటు చేసుకున్న ఆకలి మరణాలతోపాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ రెండు పార్టీలు  సంయుక్తంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అంతేగాకుండా.. ఇదే విషయమపై అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించాయి. తీర్మానానికి స్పీకర్ అనుమతించకపోవడంతో అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు వీధుల్లో పోరాటానికి దిగుతున్నాయి. దాంతో.. జాతీయ స్థాయిలో కలిసిపనిచేసేందుకు, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలోనే కలిసి ఉండలేని ఈ పార్టీలు జాతీయ స్థాయిలో ఎలా కలిసి ఉంటాయి? అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe