Breaking News

మ్యూజిక్ ప్రియులకు జియో గుడ్‌న్యూస్

Dec 03, 2018 09:14 by Admin Admin

మ్యూజిక్ ప్రియులకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సావన్‌ను సొంతం చేసుకోబోతున్నట్టు ఈ ఏడాది మార్చిలో రిలయన్స్ జియో ప్రకటించింది. తాజాగా రెండు సంస్థల విలీనం పూర్తయింది. ఇప్పుడు సావన్ పేరు కాస్తా ‘జియోసావన్’గా మారిపోయింది. అయితే, పేరు మారినా యాప్ డిజైన్, ఫీచర్ల విషయంలో ఎటువంటి మార్పు లేదు. యాపిల్ యాప్ స్టోర్ మాత్రం పాత సావన్ యాప్ స్థానంలో సరికొత్త జియోసావన్ యాప్‌ను చేర్చింది. జియోసావన్ యాప్ అందుబాటులోకి రావడంతో కాంప్లిమెంటరీ కింద జియో యూజర్లకు మూడు నెలల పాటు ఉచిత సబ్‌స్ర్కిప్షన్ ఇవ్వనున్నట్టు జియో తెలిపింది.
 
 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe