Breaking News

సీపీఎస్ 2 86 567 మంది నుంచి అభిప్రాయాలు

Dec 03, 2018 09:33 by Admin Admin

నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 2,86,567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురు లేదని సర్వే తేల్చి చెప్పింది. సీపీఎస్ సర్వేలో టీఆర్‌ఎస్ పార్టీ సీట్ల సంఖ్య 100కు పైగా దాటింది. టీఆర్‌ఎస్ పార్టీకి 94 నుంచి 104 వస్తాయని సర్వే తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రాజాకూటమి 16 నుంచి 21 సీట్లకే పరిమితం కానున్నట్లు పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 7 సీట్లు, బీజేపీకి 1 నుంచి రెండు సీట్లు, ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe