Breaking News

నరల్ వాటర్ కంపెనీలు మూసివేయండి పాకిస్థాన్ సుప్రీంకోర్టు

Dec 03, 2018 09:42 by Admin Admin

నాణ్యత లేని నీటిని తయారు చేస్తున్న మినరల్ వాటర్ కంపెనీలను మూసివేయాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఉన్నతాధికారులను ఆదేశించింది. నీటి నాణ్యత, నీటి పరీక్షకు శిక్షణ పొందిన సిబ్బంది లేని వాటర్ కంపెనీలను వెంటనే మూసేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బేవరేజస్ ప్లాంట్స్ పర్యావరణ అనుమతులు పొందలేదని నివేదికలో వాటర్ కమిషన్ సభ్యులు వెల్లడించారు. రెండు కంపెనీలు ఇండస్ నది, కాలువల నుంచి నీటిని తీసుకొస్తాయని, వాటర్ బాటిల్‌పై పొందుపరిచిన లవణాల శాతం సరిగాలేదని చీఫ్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ వెల్లడించారు. కమిషన్ నివేదికను పరిశీలించిన తర్వాత మినరల్ వాటర్ కంపెనీలు మూసివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe