Breaking News

రాజకీయాల నుంచి తప్పుకోనున్న ఉమా భారతి

Dec 04, 2018 10:51 by Admin Admin

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని (2019) కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత ఉమా భారతి ప్రకటించారు. రాజకీయాల నుంచి ఆమె రిటైర్ కానున్నారు. ఈ మేరకు ఉమా భారతి పార్టీ అధిష్టానాన్ని అనుమతి కోరారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోనున్న ఆమె ఆ తర్వాత రామ మందిరం నిర్మాణంతో పాటు, పవిత్ర గంగానది ప్రక్షాళనపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.  కాగా కొద్ది రోజుల క్రితం విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe