Breaking News

75 శాతం మేర పోలింగ్ నమోదైనట్టు

Dec 08, 2018 18:48 by Admin Admin

తెలంగాణలో  75 శాతం మేర పోలింగ్ దాటినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ నమోదైనట్టు సమాచారం. 78 శాతం వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీలో పోలింగ్ శాతం మదింపు కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలింగ్ నమోదుపై కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్, తమకే ఎక్కువ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11న వెలువడే ఫలితాలతో పోటీ చేసిన నేతల భవితవ్యం తేలనుంది. అధికార టీఆర్ఎస్ మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేదా ప్రజాకూటమి ఎక్కువ స్థానాలు గెలిచి సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో వేచి చూడాల్సిందే.   

Facebook like
Google Plus Circle
Youtube Subscribe