Breaking News

తొలి టెస్టులో భారత జట్టు పట్టు బిగిస్తోంది

Dec 08, 2018 19:02 by Admin Admin

తొలి టెస్టులో భారత జట్టు పట్టు బిగిస్తోంది. ఆరంభంలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) ధాటిని కనబరచగా చటేశ్వర్‌ పుజారా (127 బంతుల్లో 4 ఫోర్లతో 40 బ్యాటింగ్‌) పోరాడుతున్నాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ముగిసేసరికి 61 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 166 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా క్రీజులో పుజారాతో పాటు రహానె (1 బ్యాటింగ్‌) ఉన్నాడు. కనీసం మరో 150 పరుగులైనా అదనంగా సాధిస్తే ఆసీ్‌సను దెబ్బతీయొచ్చు. విరాట్‌ కోహ్లీ (104 బంతుల్లో 3 ఫోర్లతో 34) తన సహజశైలికి భిన్నంగా క్రీజులో పాతుకుపోయి పుజారాతో కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. అయితే రెండు జట్ల ఇన్నింగ్స్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మొత్తం 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు ఆసీస్‌ 98.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.

స్కోరు బోర్డు
 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 250
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: ఫించ్‌ (బి) ఇషాంత్‌ 0; హారిస్‌ (సి) విజయ్‌ (బి) అశ్విన్‌ 26; ఖవాజా (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 28; షాన్‌ మార్ష్‌ (బి) అశ్విన్‌ 2; హ్యాండ్స్‌కోంబ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 34; ట్రావిస్‌ హెడ్‌ (సి) పంత్‌ (బి) 72; పైన్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 5; కమిన్స్‌ (ఎల్బీ) బుమ్రా 10; మిచెల్‌ స్టార్క్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 15; లియాన్‌ (నాటౌట్‌) 24; హాజెల్‌వుడ్‌ (సి) పంత్‌ (బి) షమి 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం: 98.4 ఓవర్లలో 235 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-45, 3-59, 4-87, 5-120, 6-127, 7-177, 8-204, 9-235, 10-235. బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 20-6-47-2, బుమ్రా 24-9-47-3, షమి 16.4-6-58-2, అశ్విన్‌ 34-9-57-3, మురళీ విజయ్‌ 4-1-10-0.
 

 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) పైన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 44; విజయ్‌ (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) స్టార్క్‌ 18; పుజారా (బ్యాటింగ్‌) 40; కోహ్లీ (సి) ఫించ్‌ (బి) లియాన్‌ 34; రహానె (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 61 ఓవర్లలో 151/3. వికెట్ల పతనం: 1-63, 2-76, 3-147. బౌలింగ్‌: స్టార్క్‌ 10-3-18-1; హాజెల్‌వుడ్‌ 16-9-25-1; కమిన్స్‌ 11-4-33-0; లియాన్‌ 22-3-48-1; హెడ్‌ 2-0-13-0.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe