Breaking News

సెల్‌కాన్‌ కంపెనీలో ఉద్యోగులను తొలగించాలని

Dec 08, 2018 19:20 by Admin Admin

చిత్తూరు జిల్లా  సమీపంలో ఉన్న సెల్‌కాన్‌ కంపెనీలో 120మంది ఉద్యోగులను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించినట్టు సమాచారం. వీరందరినీ వచ్చే నెల 22వ తేదీ నుంచి విధులకు రావద్దని నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఉద్యోగుల కథనం మేరకు.. ఈ కంపెనీలో ప్రస్తుతం సుమారు 400 మంది పనిచేస్తున్నారు. ఇటీవల సెల్‌ఫోన్ల ఉత్పత్తి తగ్గడంతో కంపెనీని చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో సంస్థ యాజమాన్యం శనివారం ఉద్యోగులతో సమావేశం నిర్వహించి తొలగించే విషయాన్ని చెప్పింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe