Breaking News

దేశవ్యాప్తంగా చలి ప్రభావం

Dec 10, 2018 10:08 by Admin Admin

దేశవ్యాప్తంగా చలి ప్రభావం క్రమంగా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా పొడి వాతావరణం నెలకొని ఉండటంతో చలి ప్రభావం పెరిగే అవకాశముందని హెచ్చరించింది. తెల్లవారుజామున పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. మంచు, చలి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని, ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఒకటి రెండు చోట్ల చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe