Breaking News

కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో

Dec 10, 2018 22:25 by Admin Admin

కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని కాస్త వెనకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయం అని చాలామంది భావించారు. కానీ పరిస్థితులు కాస్త క్లిష్టంగానే ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన రౌండ్లలో టీడీపీకి ఆధిక్యం లభించే ప్రాంతాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Facebook like
Google Plus Circle
Youtube Subscribe