Breaking News

బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ

Dec 11, 2018 02:25 by Admin Admin

బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన మూడు కీల‌క రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ వెనుక‌బ‌డింది. రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో బీజేపీ అధికారం కోల్పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న ట్రెండ్స్ ప్ర‌కారం ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. చ‌త్తీస్‌గ‌ఢ్‌లో అయితే ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్ కూడా వెనుక‌బ‌డ్డారు. రాజ‌స్థాన్‌లో బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి వ‌సుంధ‌ర రాజె, కాంగ్రెస్ త‌ర‌ఫున రేసులో ఉన్న స‌చిన్ పైల‌ట్‌, అశోక్ గెహ్లాట్ ఆధిక్యంలో ఉన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe