Breaking News

పీవీ సింధు శుభారంభం

Dec 12, 2018 11:09 by Admin Admin

వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో బుధవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సింధు 24-22, 21-15తో డిఫెండింగ్ చాంపియన్ యవుగూచి (జపాన్)పై విజయం సాధించింది. గతేడాది దుబాయ్‌లోజరిగిన ఈ టోర్నీలో సింధు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్ నుంచే ఆధిపత్యం కొనసాగించిన సింధు ఏ మాత్రం ఒత్తిడికి లేకుండా యవుగూచిపై 24-22తో గెలుపొందగా... రెండో రౌండ్‌లో యవుగూచి కాస్త ప్రతిఘటించిన సింధు ముందు తలవంచింది. దీంతో రెండో రౌండ్‌లో కూడా సింధు 21-15తో గెలిచి మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe