Breaking News

టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని

Dec 12, 2018 11:24 by Admin Admin

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని తాను ముందే హెచ్చరించానని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చెప్పారు. మెదక్ జిల్లా నుంచి తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆమె ఎన్నికల ఫలితాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదట తానే వ్యతిరేకించానన్న విషయాన్ని విజయశాంతి గుర్తు చేశారు. పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇస్తానని, కనీసం పార్లమెంటు ఎన్నికల నాటికైనా ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe