Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది

Dec 12, 2018 11:29 by Admin Admin

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కేటీఆర్‌ను కలుసుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరతానని వెల్లడించారు. అటు వైరా స్వతంత్ర ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా టీఆర్ఎస్‌‌లో చేరతానని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe