Breaking News

అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్

Dec 12, 2018 11:34 by Admin Admin

కస్టమర్లను ఆకట్టుకునేందుకు అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎంఐ మ్యాక్స్ 2, రెడ్‌మి 6 ప్రో ఫోన్లతోపాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది. ఎంఐ ఉత్పత్తులపై డిసెంబర్ 14 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఈఎంఐతో ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు 5 శాతం తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఫోన్ల ఆఫర్లపై ఐసీఐసీఐ బ్యాంకు, అమెజాన్ ఇండియా ఒప్పందం చేసుకున్నారు. షావోమి రెడ్‌మి 6 ప్రో 3జీబీ, 32జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ఫోన్ రూ. 9,899, ఎంఐ మ్యాక్స్ ఫోన్ రూ. 10,949 లభిస్తోందని కంపెనీ పేర్కొంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe