Breaking News

బ్యాలెట్ ఎన్నికల కోసం ప్రజా ఉద్యమం

Dec 14, 2018 19:14 by Admin Admin

ఈవీఎంలు ట్యాంపరింగ్ చెయ్యడంతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, జరిగిన అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్ర యించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇకనుంచి బ్యాలెట్‌తోనే అన్ని ఎన్నికలు నిర్వహించా లనే డిమాండ్‌తో ప్రజాఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఎన్నికల అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించా లని డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ విషయం లేవనెత్తాలని ఎఐసీసీని కోరుతూ నిర్ణయించింది. శుక్రవారం ఎన్నికల్లో ఓటమిపై టీపీసీసీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, జెట్టి కుసుమకు మార్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన డీకే అరుణ, సునీతా లకా్ష్మరెడ్డి, జీవన్ రెడ్డి, శ్రవణ్ దాసోజు, ఆరెపల్లి మోహన్,    ప్రేమ్ సాగర్, రమేష్ రాథోడ్, పవన్‌కుమార్, హైకోర్టు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నికలు ఎలా జరిగాయో ఒక్కొక్కరిని ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe