Breaking News

గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదలిక

Dec 15, 2018 19:51 by Admin Admin

గ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘ఫెథాయ్’ తుపానుగా మారింది. శుక్రవారం సాయంత్రానికి మచిలీపట్నానికి ఆగ్నే యంగా 1090 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలోను ఇది ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారుతుందని, ఆ తర్వాతి 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం మధ్యా హ్నం రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకి నాడ... ప్రకాశం జిల్లా ఒంగోలు మధ్య ఎక్కడైనా తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించా రు.  దక్షిణ కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ అనే ప్రైవేటు వాతావరణ సంస్థకు చెందిన ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త మహేశ్ పలావత్ తెలిపారు. తీరం దాటిన తర్వాత గాలుల ప్రభావం తగ్గనుంది.  తుపాను దిశ మార్చుకుంటే దక్షిణకోస్తా వైపు వెళ్లి... మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ, ఇస్రో, నాసా ఈ తుపానుపై ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న బులెటిన్లను పరిశీలిస్తున్న అధికారులు దీని కదలికలపై ఒక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పలు ఓడ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe