Breaking News

జవాన్లను చుట్టుముట్టిన స్థానికులు

Dec 15, 2018 19:56 by Admin Admin

జమ్ము కశ్మీర్ అల్లర్లతో అట్టుడికింది. పుల్వామా జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ ప్రాంతానికి స్థానికులు భారీగా చేరుకుని భద్రతా బలగాలను చుట్టుముట్టడంతో, వారిని అడ్డుకునేందుకు జవాన్లు కాల్పులు జరుపగా ఏడుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. సిమూ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల్లో చేరిన మాజీ జవాను జహూర్ అహ్మద్ ఠోకర్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా అమరుడయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సామాన్యులపై భద్రత బలగాలు కాల్పులు జరపడంపై జమ్ము కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.  ఉద్రిక్తతలు పెరగకుండా చూసేందుకు కశ్మీర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్, దక్షిణ కశ్మీర్‌లో బంద్ వాతావరణం కనిపించింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe