Breaking News

తీవ్రత తగ్గడంతో తప్పిన పెనుముప్పు

Dec 17, 2018 21:48 by Admin Admin

ఈనెల 10న ఏర్పడిన అల్ప పీడనం తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారింది. 13న వాయుగుండంగా, తరువాత తీవ్ర వాయుగుండంగా బలపడింది. శనివారం ‘పెథాయ్‌’ తుఫానుగా మారింది. ఆదివారం రాత్రి తీవ్ర తుఫాన్‌గా బలపడింది. సోమవారం బలహీనపడి తూర్పు గోదావరి జిల్లాలో తీరం దాటింది.

డిసెంబరులో తుఫాన్లు రావడం అరుదు! పెథాయ్‌తో గుంటూరు నుంచి విశాఖపట్నం వరకూ వర్షాలు కురిశాయి. తుఫాను తీరాన్ని తాకే సమయంలో బలహీనపడటంతో గాలులు తగ్గి వర్షాలు స్థిరంగా కురిశాయి. మంగళవారం ఉత్తరాంధ్రలో వర్షాలు కురవనున్నాయి.
 

 

తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలు రైళ్లు, బస్సు సర్వీసులను రద్దు చేశారు. 60 రైళ్లను రద్దు చేయగా... 12 దారి మళ్లించారు. 4 విమాన సర్వీసులను రద్దు చేశారు. పరిస్థితి మొత్తం అదుపులోకి రావడంతో... రైళ్లు, విమాన సర్వీసులను సోమవారం రాత్రి నుంచి పునరుద్ధరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe